‘లక్ష్య’ న్యూ పోస్టర్ విడుదల..!

యంగ్ హీరో నాగ శౌర్య ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కొన్ని చిత్రాల షూటింగ్స్ ఇప్పటికే పూర్తి కాగా మరి కొన్ని చిత్రాలు తుదిదశకు చేరుకునన్నాయి. ఈ క్రమంలో ప్రాచీన విలు విద్య అనగా ఆర్చరీ స్పోర్ట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘లక్ష్య’ టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్‌గా ఉంది. ఈ చిత్రంలో స్టైలిష్ విలన్ జగపతి బాబు కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీలో నాగ శౌర్య సరసన కేతిక శర్మ నటిస్తోంది.

- Advertisement -

ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనూ మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది మూవీ యూనిట్. హ్యాష్ ట్యాగ్ ‘లక్ష్య ఫ్రైడే’ పేరిట ప్రతీ ఫ్రైడే మూవీకి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ‘లక్ష్య’ నుంచి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నాగశౌర్య నుదుటి‌పై కేతిక శర్మ ముద్దు పెడుతున్నట్లు ఉన్న పోస్టర్ వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. సరికొత్త లుక్‌లో నాగశౌర్య ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

Share post:

Popular