నాని ఖాతాలో మరో రికార్డ్….!

టాలీవుడ్ లో నానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు కుర్రకారును, ఇటు పడుచు అమ్మాయిలను నాని వలలో వేసుకున్నాడనే చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేస్తూ కుటుంబ కథా చిత్ర హీరోయి అయ్యాడు నాని. రాజమౌళితో ఈగ సినిమా తీసినప్పటి నుంచి నాని కెరీర్ ఊపందుకుందనే చెప్పొచ్చు. అప్పటి నుంచి తన సినిమాలతో రకరకాల రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఆయన్ని నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు.

తాజాగా నేచురల్ స్టార్ నాని ఇన్ స్టాగ్రామ్ లో నాలుగు మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. ఎప్పుడూ అభిమానులతో టచ్ లో ఉండే నాని, సోషల్ మీడియా వేదికగా అనేక విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉండగా మరో వైపు శ్యామ్ సింగ రాయ్, సుందరానికి మూవీస్ చేస్తూ ఉన్నాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాని ఇన్ స్టా గ్రామ్ లో ఇటువంటి రికార్డు నెలకొల్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest