ఛీ… ఛీ ఇదేం బుద్ది… నటుడు అరెస్ట్..!

ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉన్న చాలా మంది నటులు తోటి వారిని లైంగికంగా వేధిస్తున్నారని బయట పడుతోంది. అప్పట్లో మీటూ ఉద్యమం పేరిట పెద్ద దుమారమే రేగింది. పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న చాలా మందిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. తాజాగా ప్రముఖ టీవీ నటుడు ప్రచీన్ చౌహాన్‌ను లైంగిక వేధింపుల ఆరోపణలతో ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నటుడిపై గుర్తు తెలియని అమ్మాయి కేసు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నటుడిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 354,342,323, 506 (2) సెక్షన్ల కింద ప్రచీన్ చౌహాన్ పై కేసు నమోదయింది. బుల్లి తెర మీదనే కాకుండా యూట్యూబ్ లో కూడా ఇతగాడికి మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని రోజుల క్రితమే పెర్ల్ వి పూరి అనే నటుడిని సైతం లైంగిక ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. కానీ అతడు ప్రస్తుతం బెయిల్ పొంది బయటకు వచ్చాడు.