పేదలకు జగన్ శుభ‌వార్త‌.. నేడు మ‌రో మ‌హ‌త్త‌ర పథకానికి శ్రీ‌కారం!

క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలోనూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇక నేడు పేద‌ల కోసం జ‌గ‌న్ మరో మ‌హ‌త్త‌ర ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేడు వర్చువల్ విధానంలో జ‌గ‌న్ `వైఎస్సార్ జగనన్న కాలనీ`ల పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే స్తోమత లేనివారికి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుంది. స్థలం ఉండీ కట్టుకోలేని వారికి అందుకయ్యే ఖర్చును తన వాటా కింద భరిస్తుంది.

ఇలాంటి వారు 4.33 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. జగనన్న కాలనీల్లో ఒకే రకమైన నమూనాతో ప్రతి ఇంటిని 340 చదరపు అడుగుల పరిధిలో నిర్మించనుంది. ఇక ఇందుకోసం ప్రభుత్వం రూ.28,084 కోట్ల నిధులు కేటాయించింది.