వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో నాని..?

నేచుర‌ల్ స్టార్ నాని సినిమా అంటే మినిమ‌మ్ హిట్ గ్యారంటీ టాక్ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న శ్యామ్ సింగ‌రాయ్ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి న‌టిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. అయితే కొవిడ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ త‌ర్వాత మిగిలిన షెడ్యూల్‌ను పూర్తి చేయ‌నున్నారంట‌. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్‌తో నాని ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

రీసెంట్‌గానే వ‌కీల్ సాబ్ సినిమాతో వేణు బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు అందుకున్నాడు. దీంతో వేణు, నాని కాంబోలో సినిమా దాదాపు ఓకే అయింద‌ని తెలుస్తోంది. వీరి కాంబోలో ఇప్ప‌టికే ఎమ్‌సీఏ వ‌చ్చింది. ఇప్పుడు కొత్త సినిమాకు కేవలం అధికారిక ప్ర‌క‌ట‌న ఒక్క‌టే పెండింగ్ లో ఉంద‌ని, అన్ని ర‌కాల ప‌నులు స్టార్ట్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో పాటే వివేక్ ఆత్రేయ డైరెక్ష‌న్‌లో అంటే సుంద‌రానికి సినిమాను లైన్‌లో పెట్టాడు నాని. ఇప్పుడు చేస్తున్న శ్యామ్ సింగ‌రాయ్ పూర్త‌యిన త‌ర్వాత వీటిలో ఏ చిత్రాన్ని మొద‌ట సెట్స్ పైకి నాని తీసుకెళ్తాడో తెలుస్తుంది.