కఠిన క్వారెంటైన్‌లో కోహ్లీ సేన.. వీడియో వైరల్..!

ఇప్పుడు క‌రోనా ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిందే. అయినా ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో ఇండియ‌న్ క్రికెట్ టీమ్ వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆడేందుకు ఇంగ్లండ్ బ‌య‌లు దేరింది. మ‌న దేశంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఐపీఎల్‌ను ర‌ద్దు చేసిన బీసీసీఐ.. ఇంగ్లండ్‌లో కేసులు త‌క్కువ‌గా ఉండ‌టంతో ఈ టోర్నీకి మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఆట‌గాళ్లు త‌మ భార్య‌ల‌తో క‌లిసి ఇంగ్లండ్‌కు వెళ్లారు.

కానీ అక్క‌డ మ‌న‌వాళ్ల‌కు క‌ఠిన క‌రోనా నిబంధ‌న‌లు విధించారు. తొలి మూడు రోజుల పాటు క్రికెటర్లు కఠిన క్వారెంటైన్‌లో ఉండాల‌ని అధికారులు సూచించారు. దీంతో ప్లేయర్లు ఒకర్ని ఒకరు చూసుకునే వీలు కూడా లేకుండా ఒంటరిగానే ఈ క్వారంటైన్‌లో ఉంటారు. ఈ విషయాన్ని క్రికెటర్ అక్షర్ పటేల్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపాడు. ముంబై నుంచి సౌతాంప్టన్ బయలుదేరిన విమానంలో పురుషుల‌తో పాటు, మహిళల జట్టు క్రికెటర్లు కూడా వెళ్లారు. జూన్ 18న న్యూజిలాండ్‌తో టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.

Share post:

Latest