న‌య‌న్‌లో నచ్చేది అదే..ఓపెన్ అయిన విఘ్నేష్‌ శివన్‌!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గ‌త కొన్నేళ్ల నుంచి కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. వీరి ల‌వ్ మ్యాట‌ర్ అంద‌రికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్‌. ఈ నేప‌థ్యంలోనే వీరిద్ద‌రూ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా విఘ్నేష్ శివ‌న్ త‌న ఫాలోవ‌ర్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో కాసేపు సరదాగా ముచ్చటించారు. నెటిజ‌న్స్ అడిగిన చాలా ప్ర‌శ్న‌ల‌కు ఓపిక‌గా స‌మాధానం ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్‌..నయనతారలో నచ్చే క్వాలిటీస్‌ ఏంటి అని ప్ర‌శ్నించాడు.

అందుకు విఘ్నేష్‌ నయన్‌ సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, నయన్‌తో కలిసి దిగిన ఫేవరేట్‌ పిక్ ను కూడా అభిమానుల‌తో పంచుకున్నాడు విఘ్నేష్‌. దాంతో విఘ్నేష్‌, న‌య‌న్‌ల ప్రేమాయ‌ణం మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

న‌య‌నతార‌లో త‌న‌కు న‌చ్చిన విష‌యం బ‌య‌ట‌పెట్టిన ప్రియుడు