ఓటీటీని వ‌ద‌ల‌ని త‌మ‌న్నా..మ‌రో వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నెల్‌?

త‌మ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు వ‌రుస వెబ్ సిరీస్ల‌తో డిజిట‌ల్ రంగంలోనూ దూసుకుపోతోంది. ఆ మ‌ధ్య లెవన్త్ అవర్, నవంబర్ స్టోరీ వెబ్‌సీరీస్‌లలో నటించి న‌ట‌నాప‌రంగా మంచి మార్కులు కొట్టేసిన త‌మ‌న్నా.. తాజాగా మ‌రో సిరీస్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ట‌.

రొమాంటిక్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కబోతోంద‌ట‌. అరుణిమా శర్మ తెరకెక్కించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో తమన్నా నెగిటివ్‌ రోల్‌లో కనిపించనుందని.. ఈ సిరీస్‌ కోసం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ అమెజాన్ ప్రైమ్ చిత్ర నిర్మాలతో భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

ఇక సెప్టెంబ‌ర్‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సిరీస్‌.. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న‌ట్లు స‌మాచారం. కాగా, త‌మ‌న్నా ప్ర‌స్తుతం ఎఫ్ 3, మ్యాస్ట్రో చిత్రాల‌తో పాటు కేజీఎఫ్ ఫేమ్ య‌ష్ సినిమాలోనూ న‌టిస్తోంది.