లాక్‌డౌన్‌ను అలా వాడేసుకుంటున్న‌ తాప్సీ!

తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన ఈ అమ్మ‌డు.. టాలీవుడ్‌లో కెరీర్ ఊపందుకోకుండానే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో శ‌భాస్ మిథూ ఒక‌టి. భార‌త మ‌హిళా క్రికెట్ జుట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ జీవిత క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రాహుల్ డొలకియా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తాప్సీ మిథాలీ రాజ్ గా చెలరేగిపోనుంది. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది.

ఇక ప్ర‌స్తుతం ఇంట్లోనే ఉంటున్న తాప్సీ.. ఈ లాక్‌డౌన్‌ను తన మేజర్‌ ఫిట్‌నెస్‌ గోల్స్‌ సాధించేందుకు బాగానే వాడుకుంటుంది. అవును, శభాష్‌ మిథూ కోసం అథ్లెట్‌ శరీరాకృతిని పొందేందుకు లాక్‌డౌన్‌లోనూ బ్రేక్ లేకుండా తాప్సీ తీవ్రంగా శ్ర‌మిస్తోంది. కాగా, త‌ప్సీ శ‌భాష్ మిథూతో పాటుగా లూప్‌లపేటా, హసీన్‌ దిల్‌రుబా, రష్మీ రాకెట్ చిత్రాల్లో కూడా న‌టిస్తోంది.