సంగీత ప్రపంచంలోకి సురేష్ ప్రొడక్షన్స్..!

1963 లో మూవీ మొఘల్ డా. రామానాయుడు తన పెద్ద కొడుకు సురేష్ బాబు పేర నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ అంచలంచెలుగా ఎదిగి… తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 1964వ సంవత్సరంలో సూపర్ స్టార్, నట చక్రవర్తి ఎన్టీరామారావుతో చేసిన రాముడు‌‌‌‌– భీముడు చిత్రంతో మొదటి విజయాన్ని అందుకుంది. బ్యానర్ స్థాపించి.. 50 ఏళ్లవుతున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ SP మ్యూజిక్ పేర తమ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

తెలుగు సంగీత రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు తమ శాయ శక్తులా కృషి చేస్తామని వెల్లడించారు. SP మ్యూజిక్కు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని త్వరలోనే తమ ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయని ప్రకటించారు. తెలుగులోనే కాకుండా దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించిన చరిత్ర సురేష్ ప్రొడక్షన్స్ది. తాజాగా సంగీత రంగంలోకి కాలుపెడుతున్న సురేష్ ప్రొడక్షన్స్ కి అన్నీ విజయాలే కలగాలని కోరుకుందాం. ఆల్దబెస్ట్ సురేష్ ప్రొడక్షన్స్.

Share post:

Latest