సునీల్ `క‌న‌బ‌డుట‌లేదు` టీజ‌ర్‌కు డేట్ ఫిక్స్‌!

కమిడియన్‌గానే కాకుండా హీరోగా, విల‌న్‌గా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న న‌టుడు సునీల్ తాజా చిత్రం క‌న‌బ‌డుట‌లేదు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రంలో సునీల్ డిటెక్టివ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

ఎమ్‌.బాల‌రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు మేక‌ర్స్‌.

క‌న‌బ‌డుట‌లేదు టీజ‌ర్‌ను జూన్ 26న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. కాగా, ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ స్పార్క్‌లో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులనూ స్పార్క్ సొంతం చేసుకుంది.

Image

Share post:

Latest