మ‌రో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతున్న స‌మంత‌?

పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న అక్కినేని వారి కోడ‌లు స‌మంత.. మ‌రోవైపు బిజినెస్ ఉమెన్‌గా కూడా స‌త్తా చాటుతోంది. ఏకమ్ అంటూ ఓ స్కూల్ స్టార్ట్ చేసిన ఈ అమ్మ‌డు.. ఆ మ‌ధ్య సాకీ పేరుతో బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది.

సాకీ అనేది ఆన్‌లైన్ బిజినెస్ కావ‌డంతో విదేశాకు చెందిన వారు కూడా ఆర్డ‌ర్స్ చేస్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం సాకీ స్టోర్ దుస్తులను అమెరికా సింగపూర్ మలేషియా దేశాలకు కూడా వెళ్తుండడం విశేషం. అయితే ఇప్పుడు స‌మంత మ‌రో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంద‌ట‌.

త్వ‌ర‌లో ఈ బ్యూటీ జ్యువ‌ల‌రీ బిజినెస్ స్టార్ట్ చేయ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టికే త‌న ఫ్రెండ్ త‌మ‌న్నా వైట్ అండ్ గోల్డ్ అనే పేరుతో ఆన్లైన్ జ్యువలరీ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అదే బాటలో స‌మంత కూడా ప‌య‌నిస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest