మ‌ళ్లీ ఆ స్టార్ హీరోతో జోడీ క‌ట్ట‌బోతున్న సాయి ప‌ల్ల‌వి?!

కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్, టాలీవుడ్ టాలెండెట్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ధనుష్ తెలుగులో నటించనున్న ఫస్ట్ మూవీ ఇదే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా సాయి ప‌ల్ల‌విని తీసుకునేందుకు సన్నాహాలు జ‌రుగుతున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది.

సాయి పల్లవి ఇటు శేఖర్ కమ్ములతో ఫిదా, తాజాగా లవ్ స్టోరి సినిమాలు చేసింది. అటు ధనుష్‌తోను మారి 2 లో జతకట్టింది. ఈ నేప‌థ్యంలోనే శేఖర్ కమ్ముల, ధనుష్ ప్రాజెక్ట్‌లోకి సాయి పల్లవి యాడ్ అయితే మరింత క్రేజ్ వస్తుందని..అందుకే ఆమెనే హీరోయిన్‌గా ఫైన‌ల్ చేయాల‌ని మేకర్స్ భావిస్తున్నార‌ట‌. మ‌రి ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే.

Interesting: Dhanush With Sekhar Kammula? - Gulte

Share post:

Latest