పుకార్ల‌పై నంద‌మూరి హీరో స్పందన..!

టాలీవుడ్ మూవీ అసోసియేష‌న్ ఆర్టిస్ట్ ఎన్నిక‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు హీరో నంద‌మూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డంలేద‌ని స్ప‌ష్టం చేశారు. పోటీ చేస్తున్న‌ట్లు కొంత మంది కావాలనే పుకార్లు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. అగ్రతారలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సారి పోటీకి నిలుచున్నారు.

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుటుంబం మా అసోసియేష‌న్ పీఠాన్ని ద‌క్కించుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మోహన్ బాబు తనయుడు విష్ణు మా అధ్యక్షుడిగా బ‌రిలోకి దిగుతుండ‌టంతో మోహ‌న్‌బాబు ఫిలిం సర్కిల్లోని త‌న పరిచయస్తులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. మ‌ద్ద‌తు కోసం ఇప్పటికే సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు తండ్రి కృష్ణ ఇంటికి మోహ‌న్‌బాబు వెళ్లారు. జాతీయ అవార్డు విన్నర్ ప్ర‌కాశ్‌రాజ్ కూడా ఈ సారి మా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నాడు. కాగా.. ప్రకాశ్ రాజ్ ను స్థానికేతరుడని చెప్పి.. ఓట్లు దండుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.

Share post:

Latest