మార్కెట్ పడినా..రాశిఖ‌న్నా రెమ్యున‌రేష‌న్ త‌గ్గించ‌డం లేదా?!

మ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రాశిఖ‌న్నా..ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోయిన్‌గా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ మూవీలో తన అంద‌చందాల‌తో పాటు న‌ట‌న ప‌రంగా కూడా ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత రాశికి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి.

దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ భామ ప‌లు హిట్ల‌ను కూడా ఖాతాలో వేసుకుంది. ఇక కెరీర్ మొద‌ట్లో బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ‌.. ఈ మ‌ధ్య స‌న్న‌బ‌డి వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతోనే ప్రేక్ష‌కుల‌కు ప‌ల‌క‌రించింది. కానీ, ఈ చిత్రం దారుణంగా ఫ్లాప్ అవ్వ‌డంతో.. రాశి మార్కెట్ అడ్డంగా ప‌డిపోయింది.

అయిన‌ప్ప‌టికీ.. ఈ అమ్మ‌డు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. ప్ర‌స్తుతం ఈమె నాగ చైతన్య స‌ర‌స‌న థాంక్యూ, గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ చిత్రాల్లో న‌టిస్తోంది. అయితే ఈ చిత్రాల‌కు కోటికి తగ్గకుండా రెమ్యున‌రేష‌న్ పుచ్చుకుంటుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Share post:

Latest