చ‌ర‌ణ్ ఖాతాలో మ‌రో రికార్డు..ఉప్పొంగిపోతున్న ఫ్యాన్స్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ తాజాగా రీ స్టార్ట్ అయింది. చ‌ర‌ణ్ కూడా షూట్‌లో పాల్గొన్నారు. అలాగే ఆచార్య‌లోనూ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. రామ్ చ‌రణ్ సోషల్ మీడియాలో అంత‌గా యాక్టివ్‌గా ఉండ‌డు. ఎప్పుడో ఒక‌సారి కొన్ని ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెట్టి స‌ర్‌ప్రైజ్ చేస్తుంటారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఫాలోవ‌ర్స్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది.

ఈ క్ర‌మంలోనే చ‌ర‌ణ్ ఖాతాలో ఓ అదిరే రికార్డు వ‌చ్చి ప‌డింది. తాజాగా రామ్ చ‌ర‌ణ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య 4 మిలియ‌న్స్ (40 లక్షలు) కి చేరింది. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ సంతోషం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు ఈ విష‌యంలో చ‌ర‌ణ్ అభిమానులు కూడా ఉప్పొంగిపోతున్నారు.