దీవెనలంటే అర్థమిది: పూరి

పూరి జ‌గ‌న్నాథ్ అంటే ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆయ‌న సినిమాల ద్వారానే కాదు బ‌య‌ట కూడా బాగా పాపుల‌ర్‌. ఆయ‌న ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు మాట్లాడా మాట‌లు ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప‌జేస్తాయి. ఇప్ప‌టికే ఎన్నో విష‌యాల‌పై చాలా ఓపెన్‌గా మాట్లాడా పూరి. ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లోకి ఎక్కారు. ఈసారి మ‌నుషుల‌కు చేసే సాయంపై ఆయ‌న మాట్లాడారు. సాయం చేయ‌డానికి మించిన దీవెన మరొకటి లేదని చెప్పారు.

ఎంత‌సేపు దేవుడి దీవెన‌ల‌తోనే ప‌నులు కావ‌ని, ఎవ‌రి ప‌నులు వారు చేసుకుంటేనే బాగుంటుంద‌న్నారు. కేవ‌లం దీవెనలతోనే జీవితంలో కష్టాలు మాయం కావని, కష్టపడి పనిచేస్తేనే అనుకున్న‌ది సాధిస్తామంటూ చెప్పారు. నిజానికి ఒకరి దీవెనల వల్ల ఎవ‌రి సమస్యలేమీ తీరిపోవ‌ని, అవ‌న్నీ మ‌న న‌మ్మ‌కం మాత్ర‌మే అంటూ చెప్పుకొచ్చారు. మనకు ఆశలు ఎక్కువ కాబట్టి అన్నీ నమ్ముతామ‌ని, కానీ వాస్త‌వానికి ఏది జ‌రగాలో అదే జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు. పిల్ల‌లు గొప్ప‌వాళ్లు కావాలంటే దీవెన‌లు స‌రిపోవ‌ని, అందుకు త‌గ్గ గైడెన్స్ ఉండాల‌న్నారు.