ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ ఇదేనా…?

మా ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఏడు ఎన్నికల్లో చాలా మంది పోటీకి నిలుచుంటున్నారు. మంచువారబ్బాయి విష్ణు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ నడుమ పోరు ఆసక్తికరంగా ఉండనుందని సినీ వర్గాలే కాదు సాధారణ జనాలు కూడా అనుకుంటున్నారు. ఈ ఎలక్షన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇరు వర్గాల వారు తమకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఈ ఏడు మా పీఠం కోసం బరిలో ఏకంగా నలుగురు నిల్చున్నారు. దీంతో మాలో చతుర్ముఖ పోరు తప్పేట్లు లేదు.

ఇదిలా ఉండగా.. నటుడు ప్రకాశ్ రాజ్ వర్గాన్ని ఈ రోజు ప్రకటించారు. మొత్తం 27 మందితో కూడిన జాబితాను మీడియాకు విడుదల చేశారు. వారిలో 1)ప్రకాశ్ రాజ్ 2)జయసుధ 3) శ్రీకాంత్ 4) బెనర్జీ 5) సాయికుమార్ 6) ప్రగతి 7) అనసూయ 8) సన 9)అనిత చౌదరి 10)సుధ 11) అజయ్12) నాగినీడు 13) బ్రహ్మాజీ 14) రవిప్రకాష్ 15) సమీర్ 16) ఉత్తేజ్ 17) బండ్ల గణేష్ 18) శ్రీరామ్ 19) శివారెడ్డి 20) భూపాల్ 21) సురేష్ 22) ఖయ్యుం 23) సుడిగాలి సుధీర్ 24) గోవిందరావు 25) శ్రీధర్ రావు 26) తనీష్ 27) టార్జాన్