పవర్ స్టార్ తో డాషింగ్ డైరెక్టర్ పూరీ ..?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ “బ‌ద్రి” చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరీ జ‌గ‌న్నాథ్‌. మొదటి చిత్రంతోనే తాను అదోరకం అని చాటి చెప్పిన పూరీ ఆ తర్వాత అదే తీరును కంటిన్యూ చేశాడు. ఆ విధంగా స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్ర‌స్తుతం ‘లైగర్’మూవీతో బిజీగా ఉన్న పూరీ జ‌గ‌న్నాథ్‌ తర్వాత పవన్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పవన్ పూరీది క్రేజీ కాంబో కావడం ఒక కారణమైతే గతంలో పూరీ చేసిన వ్యాఖ్యలు కూడా మరోకారణం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం తర్వాత ఇక, తాను పవన్ తో సినిమాలు తీయను అని ప్రకటించాడు పవన్. అప్పట్లో ఈ కామెంట్స్ సంచలనం రేకెత్తించాయి. అలాంటిది ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ తో పూరీ సినిమా అనే వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారాయి. వీళ్లిద్దరినీ బండ్ల గణేష్ కలపబోతున్నారని టాక్. పవన్ క‌ల్యాణ్ తో సినిమా చేయాలని గణేష్ చాలా కాలంగా చూస్తున్నారు.

Share post:

Latest