” పక్కా కమర్షియల్” ఫస్ట్ లుక్ రిలీజ్…!

గోపీచంద్ అంటే ఇండ‌స్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న హీరో. ఆయ‌న ఇప్పుడు డైరెక్టర్ మారుతితో పక్కా కమర్షియల్ అనే సినిమాను చేస్తున్నారు. కమర్షియల్ తో పాటు ఎంట‌ర్‌టైనింగ్ జాన‌ర్ లో సినిమా ఉంటుంది. ఇక ఈ మూవీలో గోపీచంద్ లాయర్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్ గా గోపీచంద్ స‌ర‌స‌న నటిస్తోంది. ఈ మూవీ ఇప్పుడు షూటింగ్ ప్ర‌క్రియ‌లో న‌డుస్తోంది.

అయితే జూన్ 12న గోపీచంద్ బ‌ర్త్‌డే కావ‌డంతో ఈ రోజు మూవీ గిఫ్ట్‌గా ఓ సర్ప్రైజింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు డైరెక్ట‌ర్ మారుతి. ఈ పోస్ట‌ర్‌లో గోపీచంద్ చాలా స్టైలిష్ గా, న్యూలుక్‌లో బాగున్నాడు. కాగా ఈ పోస్ట‌ర్ ఓ సాంగ్ లోని ఫొటోగా తెలుస్తోంది. ఈ సినిమాతో గోపీచంద్ మంచి కమర్షియల్ లుక్ తో క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. బ‌న్నీ వాసు ఈ సినిమాకు నిర్మాత‌గా చేస్తున్నాడు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా అక్టోబర్ 1న మూవీని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Share post:

Latest