ఆక‌ట్టుకుంటున్న నిఖిల్ `18 పేజెస్` ఫస్ట్‌లుక్!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో 18 పేజెస్ ఒక‌టి. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించగా ఆయన శిష్యుడు పలనాటి సూర్యప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు.

రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈమూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నేడు నిఖిల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, ఈ సినిమాతో కెరియర్ లో మొదటిసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు నిఖిల్. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు.

Pic Talk: 18 Pages First Look - Unconventional Romance