మూడు భాష‌ల్లో రీమేక్ అవుతున్న నాని ఫ్లాప్ చిత్రం!

రీమేక్ చిత్రాల ట్రెండ్ ఈ మ‌ధ్య బాగా న‌డుస్తోంది. ఒక భాష‌లో హిట్ అయిన చిత్రాల‌ను మ‌రో భాష‌లో రీమేక్ చేసి విజ‌యం సాధిస్తున్నారు. అయితే కంటెంట్ ఉండే ఫ్లాప్ చిత్రాల‌ను రీమేక్ చేయ‌డానికి కూడా వెనుక‌డుగు వేయడం లేదు. న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది.

నాని హీరోగా ట్యాలెంట‌డ్ డైరెక్ట‌ర్ విక్రమ్ కె కుమార్ తెర‌కెక్కించిన చిత్రం నానిస్ గ్యాంగ్‌లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్‌గా న‌టించింది. రివేంజ్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లై ఫ్లాప్‌గా నిలిచింది.

కాన్సెప్ట్ బాగానే ఉన్న‌ప్పటికీ ఎందుకో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయిన‌ప్ప‌టికీ ఈ చిత్రాన్ని హిందీతో పాటు తమిళం, మలయాళ భాష‌ల్లో రీమేక్ చేస్తుండ‌టం విశేషం. ఈ విషయాన్ని విక్రమ్ కుమారే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఓ దర్శకుడికి ఇంతకంటే సంతృప్తి ఏముండ‌ద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు.

Share post:

Latest