ఆమిర్‌ ఖాన్ మూవీలో చైతు రోల్ అదేన‌ట‌?!

అక్కినేని న‌ట వారసుడు అక్కినేని నాగచైతన్య త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో చైతు ఓ కీలక పాత్ర పోషించ‌బోతున్నాడు.

అయితే ఆ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో చైతు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారట. అంతేకాదు, ప్ర‌స్తుతం ఆ పాత్ర కోసం మేకోవర్ ను కూడా మార్చుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే.. మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా, నాగ‌చైత‌న్న న‌టించిన ల‌వ్ స్టోరీ ఇప్ప‌టికే విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. విక్ర‌మ్ కె కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న థ్యాంక్యూ చిత్రం కూడా తుది ద‌శ‌కు చేరుకుంది.