ఎంపీ నవనీత్ కౌర్‌కు ఊహించని షాక్..?

అమ‌రావ‌తి ఇండిపెండెంట్ ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. మ‌హారాష్ట్ర శివసేన నేత ఆనందరావు ఆద్సుల్ న‌వ‌నీత్ కౌర్ పై బాంబే హైకోర్టులో ఆమె కుల ధృవీక‌ర‌ణ ప‌త్రాలు నకిలీవి ఎన్నిక‌ల్లో స‌మ‌ర్పించింద‌ని ఫిర్యాదుపైచేశారు. దీంతో బాంబే హైకోర్టు ఈ మేర‌కు విచార‌ణ చేసి షాకింగ్ తీర్పు వెల్ల‌డించింది.

బాంబే హైకోర్టు తీర్పు వెల్ల‌డిస్తూ న‌వనీత్ కౌర్‌కు రూ. 2 లక్షల జరిమానా విధించింది. అంతే కాదు ఆమె త‌న కుల సర్టిఫికెట్లు నకిలీవి కావ‌ని, స‌రైన‌వేనంటూ నిరూపించు కోవాల‌ని, ఇందుకు నెల రోజుల గ‌డువు ఇచ్చింది. అయితే ఈ తీర్పు ఆమె ఎంపీ పదవిపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కోర్టు తీర్పుపై ఎంపీ స్పందిస్తూ తాను ఎల్ల‌ప్పుడూ కోర్టు తీర్పుల‌ను గౌరవిస్తానని చెప్పింది. ఇక ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళతానంటూ ప్ర‌క‌టించారు ఆమె. సుప్పీం కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. ఇప్పుడు ఈ విష‌యం వైర‌ల్ గా మారింది.