మహేష్ వడిలో సితార పాప… ఫోటో వైరల్..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు టాలీవుడ్‌లోఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఆయ‌న గారాల కూతురు సితార కూడా సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గాఉంటుంది. మ‌హేశ్‌బాబు సినిమా వ‌చ్చిందంటే చాలు సితార ఆ సినిమాపై చేసే హంగామా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక మ‌హేశ్‌బాబు కూడా త‌న కుటుంబానికి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తారు. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్‌ వేస్తుంటాడు.

ఇక ఇప్పుడు షూటింగులు లేక‌పోవ‌డంతో మహేశ్‌ ఎక్కువగా కొడుకు గౌతమ్‌, కూతురు సితారాతోనే టైమ్‌పాస్ చేసేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటో, దానిపై చేసిన కామెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్‌ బాబుని సితార హత్తుకుని పడుకున్న ఫొటో నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఉదయాన్నే గట్టిగా కౌగిలించుకోవడం తప్పనిసరి ! లేదంటే నిద్ర నుంచి తేరుకోవడం చాలా కష్టం.. నిద్రలేపాలంటే ఇదో మంత్రం.. అని నమ్రత రాసుకొచ్చారు. ఇది వైర‌ల్ అవుతోంది.

Share post:

Latest