గ్రేట్ హెయిర్ డే : సితార హెయిర్ కట్ ఫోటోస్ వైరల్..!

హీరో మహేష్ బాబు కుమార్తె తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు గ్రేట్ హెయిర్ డే! లవ్ మై న్యూ హెయిర్ కట్.. మీకు నచ్చిందా? అంటూ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీనికి అభిమానుల నుంచి లవ్ ఈమోజీలు కురుస్తున్నాయి. వావ్ లుకింగ్ సో క్యూట్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

నిజంగానే ఈ కొత్త హెయిర్ స్టైల్లో సితార ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. ఆ కర్లీ హెయిర్ ఫ్రీస్టైల్లో ఎంతో లవ్ లీగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఘట్టమనేని అభిమానుల్లో వైరల్ గా మారింది. మహేష్ సర్కార్ వారి పాట చిత్రీకరణకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తన గారాట పట్టీలు సితార గౌతమ్ లతో ఇంట్లో నే టైమ్ స్పెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సీతా పాప ఇన్ స్టాలో నిరంతరం తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇతర విశేషాల్ని వెల్లడిస్తుంటుంది.

Share post:

Popular