సినీ నటుడు కత్తి మహేష్‌కు రోడ్డు ప్ర‌మాదం..!

ప్ర‌ముఖ న‌టుడు, సినీ విమర్శకుడు క‌త్తి మ‌హేష్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ స్వల్ప గాయాలతో ఆస్ప‌ట‌ల్‌లో చేరారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం దగ్గర జాతీయ రహదారిపై మహేష్ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది.

వెంటనే కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కత్తి మహేష్‌ ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్ర‌స్తుతం ఈయ‌న నెల్లూరు మెడికేర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటన నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో కత్తి మహేశ్ కారు ధ్వంస‌మైన‌ట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాగా, కత్తి మహేష్‌ది సొంత జిల్లా చిత్తూరు. అక్కడి నుంచి హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స‌మాచారం.