స‌మంత చేతుల మీద‌గా `పుష్పక విమానం` లిరికల్ సాంగ్!

దొరసాని సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్ దేవ‌ర‌కొండ‌.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శాన్వి మేఘన, గీత్ సాయిని ఇందులో హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమాలోని కళ్యాణం అనే లిరికల్ సాంగ్‌ను టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుదల చేశారు.

సిద్ శ్రీరామ్, మంగ్లీ ఆల‌పించిన ఈ లిరిక‌ల్ సాంగ్ ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి సిలకా అనే లిరికల్ వీడియోను విడుదల చేయక ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిన సంగ‌తి తెలిసిందే. కాగా, రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Share post:

Latest