మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ప‌ట్టేసిన కాజ‌ల్‌..ఆ స్టార్ హీరోతో..?!

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌త ఏడాది ప్రియుడు గౌత‌మ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది కాజ‌ల్‌. ఇక పెళ్లి త‌ర్వాత కూడా కాజ‌ల్ జోరు చూపిస్తూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది.

చిరు స‌ర‌స‌న ఆచార్య‌, కమల్‌ హాసన్ స‌ర‌స‌న ఇండియన్ 2, నాగార్జున స‌ర‌స‌న ఓ చిత్రం, దుల్కర్‌ సల్మాన్ స‌ర‌స‌న హే సినామిక, డీకే దర్శకత్వంలో ఓ సినిమా, లేడీ ఓరియంటెడ్‌ సినిమా ఘోస్టీ చేస్తున్న కాజ‌ల్‌.. ఈ మ‌ధ్య బాలీవుడ్‌లో ఉమ అనే చిత్రానికి కూడా సైన్ చేసింది. అయితే తాజాగా ఈ భామ‌కు బాలీవుడ్ నుంచి మ‌రో ఆఫ‌ర్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్ త‌మిళంలో హిట్ అయిన ఖైదీని రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అజ‌య్ భార్య పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను ఎంపిక చేశార‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఇదే నిజ‌మైతే..సింగమ్‌ తర్వాత అజయ్‌ దేవగణ్‌, కాజల్‌ అగర్వాల్‌ మరోసారి జంట కట్టబోతున్న‌ట్టు అవుతుంది.

Share post:

Latest