య‌ష్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై న్యూ అప్డేట్‌..!

కేజీఎఫ్ సినిమాతో దేశ వ్యాప్తంగా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ యష్. అప్పటి వరకు కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే స్టార్ హీరోగా ఉన్న య‌ష్‌.. కేజియఫ్ సినిమా తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇదే స‌మ‌యంలో కేజీఎఫ్ 2పై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న కేజీఎఫ్ 2 విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. మ‌న రాఖీ భాయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. య‌ష్‌ త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్‌ను నార్తన్ దర్శకత్వంలో చేయ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ మరియు హోంబాలే ఫిల్మ్స్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌నున్నార‌ని స‌మాచారం.

అలాగే యాక్షన్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో య‌ష్ నేవీ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు కూడా వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.

Share post:

Popular