`అఖండ‌`పై క్రేజీ అప్డేట్‌..సంస్కృత శ్లోకాలతో బాల‌య్య విశ్వ‌రూప‌మే!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో బాల‌య్య డ్యూయ‌ల్‌ రోల్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అందులో అఘోరా పాత్ర ఒక‌టి కాగా.. అందుకు సంబంధించిన పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. అయితే అఘోరా పాత్ర ప‌లికే సంభాష‌ణ‌ల్లో చాలా వ‌ర‌కూ సంస్క్రృత శ్లోకాలే ఉంటాయ‌ట‌.

సంద‌ర్భానుసారం బాల‌య్య ఒక్కో శ్లోకాన్ని వాడ‌తార‌ని.. వాటి అర్థాన్ని సైతం విడ‌మ‌ర‌చి చెబుతార‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో వాడే శ్లోకాల‌న్నీ బాల‌య్య పాట రూపంలోనూ పాడ‌తార‌ని స‌మాచారం. మొత్తానికి పురాణ ఇతిహాసాల‌పై మంచి ప‌ట్టు ఉన్న బాల‌య్య‌.. అఖండ‌లో విశ్వ‌రూపం చూప‌నున్నార‌న్న‌మాట‌.

Share post:

Latest