క‌రోనా వ‌చ్చి పోతే.. తెలుసుకోవ‌డం ఎలా?

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్‌లో వ‌చ్చిన క‌రోనాతో పోల్చుకుంటే సెకెండ్ వేవ్ క‌రోనా మ‌రింత వేగంగా, తీవ్రంగా విజృంభిస్తోంది. దీంతో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీ సంఖ్య‌లో న‌మోదు అయ్యాయి. అయితే చాలా మందికి క‌రోనా వ‌చ్చి పోతుంది. ఇలాంటి వారు ఎంద‌రో ఉన్నారు.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండటం వ‌ల్ల వైర‌స్ దాడి చేసినా అది బ‌ల‌హీన ప‌డిపోతుంది. అందుకే చాలా మందికి తెలియకుండానే వైరస్‌ సోకి.. దానంతట అదే పోతుంది. వైరస్‌ సోకిన వారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొంద‌రిలో మాత్రం జ్వరం, దగ్గు, తల నొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం, అలసట, క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌టం, కండ‌క‌ల‌క‌ వంటి లక్షణాలు కనబ‌డినా.. ఇమ్యూని సిస్ట‌మ్ బ‌లంగా ఉంటే వెంట‌నే త‌గ్గిపోతాయి.

ఇక త‌మ‌కూ క‌రోనా వ‌చ్చి పోయింది అన్న అనుమానం ఉన్న వారు.. పాజిటివ్ ప‌రీక్ష‌లు చేయించుకుంటే యాంటీ బాడీస్‌ ఆధారంగా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవ‌చ్చు. మ‌రో విష‌యం ఏంటంటే.. వైరస్‌ సోకినట్లు తెలియకుండానే మహమ్మారిని జయించినవారు కూడా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Share post:

Popular