‘తమ్ముడు’ సినిమా రీమేక్ రాబోతుందా..?

ఒకప్పటి టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్టులు దుమ్ము లేపుతున్నారు. తాజాగా ఆనాటి చైల్డ్ ఆర్టిస్టు ఇప్పుడు తేజ సజ్జగా హీరో అయ్యి ముందుకు వచ్చాడు. ఆనాటి సినిమాలలో పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి చిన్న స్థాయి హీరోల సినిమాలలో ఈ చిన్నోడు నటించి మెప్పించాడు. ఇలా దాదాపుగా 40 సినిమాలలో నటించాడు. ఇంద్ర సినిమాలో చిన్నప్పటి చిరంజీవిగా నటించి బాగా ఫేమస్ అయిపోయాడు. ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు.

రెండేళ్ల కింద సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించాడు తేజ. ఆ తర్వాత జాంబి రెడ్డి సినిమాతో మెయిన్ హీరోగా నటించాడు. తాజాగా తేజ తన అభిమానులతో మాట్లాడారు. మీకు పవన్ కళ్యాణ్ సినిమాలను రీమేక్ చేసే అవకాశం వస్తే ఏ సినిమాను రీమేక్ చేస్తారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించడంతో దానికి మరో ఆలోచన లేకుండా వెంటనే తమ్ముడు అని సమాధానమిచ్చాడు.

Share post:

Popular