సెట్స్‌లో అనుప‌మ అల్ల‌రి..క్రేజీ వీడియో పంచుకున్న నిఖిల్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టిస్తున్న చిత్రాల్లో 18 పేజెస్ ఒక‌టి. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ స‌మ‌ర్పణ‌లో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ మ‌ధ్య నిఖిల్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా 18 పేజెస్ ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. చాలా డిఫరెంట్‌గా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఆ ఫస్ట్ లుక్ కోసం సపరేట్‌గా షూటింగ్ చేశారు మేక‌ర్స్‌. అయితే ఈ స‌మ‌యంలో అంద‌రూ పని చేసుకుంటూ ఉంటే అనుపమా మాత్రం డ్యాన్సులు వేస్తూ అల్ల‌రి చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానుల‌తో పంచుకున్న నిఖిల్‌..నేను ఇంత వరకు చూసిన వారందరిలోనూ ఎంతో సంతోషంగా ఉంటూ ఎంజాయ్ చేస్తుండే వారిలో అనుపమ ది బెస్ట్. 18 పేజెస్ ఫస్ట్ లుక్ కోసం మేం రెడీ అవుతుంటే ఆమె మాత్రం సారంగదరియా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CP0kvwBDmcm/?utm_source=ig_web_copy_link

Share post:

Latest