`రాజా విక్ర‌మార్క`గా కార్తికేయ‌..భ‌య‌పెడుతున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌?

ఆర్ఎక్స్ 100 సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ‌.. తాజా చిత్రం రాజా విక్క‌మార్క‌. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీలైన్‌తో రాబోతున్న ఈ మూవీని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్‌పై రామారెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా కార్తికేయ లుక్ అందరికీ నచ్చింది. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది.. కానీ చిరంజీవి సినిమా టైటిల్ అయిన రాజా విక్క‌మార్కను తీసుకోవడం దగ్గరే కార్తికేయను ఓ బ్యాడ్ సెంటిమెంట్ భ‌య‌పెడుతుంద‌ట‌. ఎందుకంటే, కార్తి ఖైదీ మిన‌హా.. ఇప్ప‌టి వ‌ర‌కు చిరు టైటిల్స్ వ‌చ్చిన ఏ సినిమాను పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి.

అందుకే చిరంజీవి టైటిల్ తీసుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడడమే అని భావిస్తుంటారు. అలాంటిది కార్తికేయ సాహ‌సం చేసి చిరు టైటిల్‌తోనే వ‌స్తున్నాడు. మ‌రి ఈయ‌న స‌క్సెస్ అవుతాడో..లేదో.. చూడాలి.

Share post:

Popular