టాలీవుడ్‌పై దృష్టి సారించిన ధునుష్‌..త్వ‌ర‌లోనే..?

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. ధ‌నుష్ సినిమాలు తెలుగులోకి డ‌బ్ అవ్వ‌డం వ‌ల్ల‌.. ఇక్క‌డ కూడా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడీయ‌న‌. ఇక కోలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్న‌ ధ‌నుష్‌.. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడ‌న్న వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

మంచి క‌థ దొరికితే టాలీవుడ్ ఎంట్రీ ఇద్దామ‌ని ధ‌నుష్ ఎప్ప‌టి నుంచో భావిస్తున్నాడ‌ట‌. అయితే ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌, స్టార్ డైరెక్ట‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోయే సినిమాలో హీరోగా న‌టించ‌మ‌ని తాజాగా ధ‌నుష్‌ను సంప్ర‌దించార‌ట‌.

ఇక వారు చెప్పిన స్టోరీ బాగా న‌చ్చ‌డంతో.. వెంట‌నే ధ‌నుష్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌ను ఎనౌన్స్ చేసి.. వ‌చ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకువెళ్ల‌నున్నార‌ట‌. మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.