పరీక్షలపై ఏపీ హైకోర్టు ఆదేశాలు..?

ప్ర‌స్తుతం ఇండియాలో గ్రూప్‌-1కి ఉన్న ప్రాముఖ్య‌త ఏంటో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే గ్రూప్-1 ఎగ్జామ్స్ విషయంలో తాజాగా ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్ల‌డించింది. ఎగ్జామ్స్ మూల్యాంకనం కేసులో నిన్న హైకోర్టులో విచారణ జ‌రిగిన విస‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే అభ్యర్థుల మెయిన్స్ పేపర్ల మూల్యాంకనం ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వడంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

దీంతో కోర్టు దీనిపై విచార‌ణ జ‌రిపింది. ప్రభుత్వ సంస్థలు చేయాల్సిన పనిని ప్రైవేటు సంస్థల‌కు టీసీఎస్ అప్ప‌జెప్ప‌డం సరికాదని పిటిషన్ లో అభ్య‌ర్థులు వివ‌రించారు. కాగా ఏపీపీఎస్సీ కూడా తాము మెయిన్స్ పేపర్ల మూల్యాంకనాన్ని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తామని స్ప‌ష్టం చేయ‌లేద‌ని వివ‌రించింది. కానీ ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ధ‌ర్మాస‌నం తీర్పును రిజర్వ్ లో పెట్ట‌డం గ‌మ‌నార్హం. అయితే ఆ తీర్పుపై నేడు ప్రకటన జారీచేస్తూ ఈ ఎగ్జామ్స్ త‌ర్వాత చర్యలు అన్నిటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిచిపోనున్నాయి.