అనాథ పిల్ల‌ల‌కు స్మార్ట్ ఫోన్లు అంద‌జేయ‌నున్న ప్ర‌భుత్వం..!

June 12, 2021 at 2:23 pm

ప్ర‌స్తుతం క‌రోనా ఎంద‌రినో ఆగంజేస్తోంది. దీని కార‌ణంగా చాలామంది త‌మ త‌ల్లిదండ్రుల‌ను కోల్పుతున్నారు. ఇంకొంద‌రు పిల్ల‌ల‌ను పోగొట్టుకుంటున్నారు. అయితే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన పిల్ల‌ల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వారికి త్వ‌ర‌లోనే స్మార్ట్ ఫోన్ల‌ను అంద‌జేయాల‌ని నిర్ణ‌యించింది.

ఎందుకంటే స‌డెన్‌గా ఏదైనా స‌మ‌స్య వ‌స్తే అధికారుల‌కు తెలియ‌జేయాలంటే ఫోన్ ఉండాలి కాబ‌ట్టి ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో జిల్లా పిల్ల‌ల సంర‌క్ష‌ణ అధికారి నెంబ‌ర్‌, ఇత‌ర అధికారుల నెంబ‌ర్లు ఉంటాయి. అలాగే హెల్ప్ లైన్ నెంబ‌ర్లు, హెల్ప్ డెస్క్ నెంబ‌ర్లు కూడా ఫీట్ చేసి ఉంటాయి. వీటిని త్వ‌ర‌లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనాథ పిల్ల‌ల‌కు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఇప్ప‌టికే అనాథ‌లైన పిల్ల‌ల వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు. ఇంకా పూర్తిగా వివ‌రాలు సేక‌రించిన త‌ర్వాత వీటిని ప్ర‌భుత్వం అంద‌జేస్తుంది. అలాగే వారికి అన్ని ర‌కాల వ‌సతులు ఏర్పాటు చేయ‌నుంది ప్ర‌భుత్వం. ఎంతైనా ఈ నిర్ణ‌యం మంచిదే క‌దా.

అనాథ పిల్ల‌ల‌కు స్మార్ట్ ఫోన్లు అంద‌జేయ‌నున్న ప్ర‌భుత్వం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts