ఈటల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం..ఏం జ‌రిగిందంటే?

మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్ మ‌రియు ఆయ‌న బృందం పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఇటీవ‌లె హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల‌.. నిన్న త‌న బృందంతో స‌హా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ‌ కండువా కప్పుకుని బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దానిని గ‌మ‌నించిన‌ ఫైలెట్ వెంట‌నే అలెర్ట్ అవ్వ‌డంతో.. పెను ప్రమాదం తప్పింది.

దీంతో ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఈటల బృందం బయల్దేరింది. కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘనందన్, వివేక్, ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమాతో పాటు మొత్తం 184 మంది విమానంలో ఉన్నారు.

Share post:

Latest