ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ఈషా రెబ్బ!

ఈషా రెబ్బ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అంతకు ముందు… ఆ తరువాత.. సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. మంచి ట్యాలెంట్ ఉన్న న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. ఇక తెలుగు అమ్మాయి అయినా.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం రాజీప‌డ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఈషా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్‌ను ద‌క్కించుకోలేక‌పోయింది.

అయితే త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ మలయాళంలోకి అడుగు పెట్ట‌బోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కుంచాకో బోబన్ లాంటి స్టార్ హీరో నటిస్తోన్న ఒట్టు అనే మూవీలో హీరోయ‌న్‌గా బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది ఈషా రెబ్బ‌.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఫెల్లి తెర‌కెక్కిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో తమిళ నటుడు అరవింద్ స్వామి కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రంపై ఈషా ఫుల్ ఎగ్జైట్‌గా ఉంది.

Share post:

Popular