మ‌రో రికార్డు క్రియేట్ చేసిన దృశ్యం-2

దృశ్యం సినిమా ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముందుగా మ‌ళ‌యాంలో వ‌చ్చిన ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌డంతో తెలుగులో దీన్ని విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేశారు. ఇక్క‌డ కూడా సూప‌ర్ హిట్ కొట్టింది. ఊహ‌కు కూడా అంద‌ని స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌డంతో ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చింది.

ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా దృశ్యం 2 తెర‌కెక్కించారు. క‌రోనా వ‌ల‌న ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమా అదే స్థాయిలో బంప‌ర్ హిట్ కొట్టింది. దిగ్గజ దర్శకుడు రాజ‌మౌళి సైతం దీన్ని పొగిడారు. దర్శకుడైన జీతూ జోసెఫ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఇప్పుడ దీనికి సంబంధించి మ‌రో వార్త చెక్క‌ర్లు కొడుతోంది. ఐఎండీబీ లెక్క‌ల ప్ర‌కారం ఈ ఏడాది మొద‌టి భాగంలో అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా దృశ్యం 2 సంచ‌ల‌న రికార్డు న‌మోదు చేసింది. ఇప్టి వ‌ర‌కు అంత‌ర్జాతీయ లెక్క‌ల ప్ర‌కారం 8.8 రేటింగ్‌తో దూసుకుపోయింది ఈ సినిమా. ఇందులో మోహ‌న్ లాల్, మీనా న‌ట‌న అద్భుతంగా ఉంద‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నారు.

Share post:

Latest