దిశా బర్త్ డే సందర్భంగా టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్..!

లోఫ‌ర్ భామ దిశా ప‌టానీ అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఈరోజు ఆమె త‌న 29వ పుట్టినరోజు సందర్భంగా హీరో టైగర్ ష్రాఫ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. దిశా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కేక్ మీద 29 కొవ్వొత్తులను వెలిగించేందుకు ఏర్పాట్లు చేశాడు టైగ‌ర్‌. ఇదే క్ర‌మంలో సోషల్ మీడియా వేదిక‌గా అభిమానుల నుంచి చాలా విషెస్ వ‌చ్చాయి. ఇక టైగర్ ష్రాఫ్ దిశా కోసం ఒక ప్రత్యేక పోస్ట్ ను ఇన్ స్టాలో పోస్టు చేశాడు.

టైగ‌ర్‌, దిశా క‌లిసి సాల్సా డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో క్లిప్ ని పోస్టు చేయ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. అయితే ఇది భాఘి 2 నుంచి స్పెషల్ క్లిప్ అని స‌మ‌చారం. హ్యాపీ బర్త్ డే విలన్ అంటూ టైగర్ రాసుకొచ్చాడు. టైగర్ సోదరి కృష్ణ కూడా హార్ట్ ఎమోజీలను పోస్టు చేసింది. టైగర్ తల్లి అయేషా ష్రాఫ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దిశా ప‌టానీకి. కాగా దీనికి దిశా ప‌టానీ స్పందిస్తూ థాంక్స్ చెప్పింది.

Share post:

Latest