ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం…!

ఈ మ‌ధ్య చాలా అగ్ని ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. ఈరోజు దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ షోరూమ్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో మంటలను ఆర్పేందుకు వెంట‌నే అక్క‌డికి 30 అగ్నిమాపక వాహ‌నాలు వ‌చ్చాయి. అగ్నిమాపక శాఖ అధికారులు మంట‌లు ఆర్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో బ్లాక్ 1 వద్ద ఈ ఈరోజు ఒక్క‌సారిగా మంట‌లు వ్యాపించాయి. దీంతో స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ ఇచ్చిన ట్వీట్‌లో ఈ విష‌యాల‌ను స్ప‌ష్టంగా వెల్ల‌డించారు. ఢిల్లీలోని సెంట్రల్ మార్కెట్లోని ఓ డ్రెస్సుల షాపులో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. అయ‌తే ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 30 అగ్ని మాపక వాహ‌నాల‌తో మంటలను ఆర్పుతు్నారు సిబ్బంది. కాగా ఇందులో ఎలాంటి ప్రాణనష్టం జ‌రుగ‌లేదు.

Share post:

Latest