వాట్సాప్‌తో కరోనా టెస్ట్‌..ఎలాగంటే?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. దీంతో నిత్యం లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతుండ‌గా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఇదిలా ఉంటే..కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షల తర్వాత సీటీ స్కానింగ్‌ కీలకంగా మారింది. కానీ, ఈ సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.

దీంతో ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎక్స్‌రేను ఉపయోగించి కరోనా నిర్ధారణ చేసే సాంకేతికతను బెంగళూరుకు చెందిన ఆర్ట్‌కార్ట్‌ అనే స్టార్టప్‌ అభివృద్ధి చేసింది. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ టెక్నాలజీని ఎక్స్‌రేసేతు అని పిలుస్తున్నారు. వైద్యులు ఎక్స్‌రేల ఫొటోలను వాట్సాప్‌ ద్వారా www. xraysetu.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే కొన్ని నిమిషాల్లోనే ఫ‌లితం తెలుస్తోంది. కేవ‌లం క‌రోనాను మాత్ర‌మే కాకుండా టీబీ, న్యుమోనియా లాంటి 14 రకాల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లను ఈ వెబ్ సైట్ గుర్తించగ‌ల‌దు.

మ‌రి ఇంద‌కీ దీనిని ఎలా యూజ్ చేయాలంటే.. డాక్టర్‌ www. xraysetu.com లోకి వెళ్లాలి. ఎక్స్‌రేసేతు బీటా బటన్‌పై క్లిక్ చేస్తే..వాట్సాప్‌ చాట్‌బాక్స్‌ ఓపెన్‌ అవుతుంది. ఇప్పుడు వైద్యుడు +91 80461638638 నంబర్‌కు వాట్సాప్‌ చేయాలి. దాంతో ఎక్స్‌రే సేతు సర్వీస్‌ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత వైద్యుడు రోగి ఎక్స్‌రేను వాట్సాప్ చేస్తే.. కేవ‌లం 10-15 నిమిషాల్లో ఫలితం తెలుస్తుంది.

Share post:

Latest