ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా కేసులు, మరణాలు నిన్న భారీగా తగ్గాయి.
గత 24 గంటల్లో భారత్లో 1,14,460 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,09,339 కు చేరుకుంది. అలాగే నిన్న 2,677 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,46,759 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 1,89,232 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 2,69,84,781 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 14,77,799 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. నిన్నొక్కరోజే దేశవ్యాప్తంగా 20,36,311 కరోనా పరీక్షలు నిర్వహించారు.