బుచ్చిబాబు – ఎన్టీఆర్ సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?

మొదటి సారి లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత సినిమా థియేటర్లలో చిన్న సినిమాగా రిలీజైన ఉప్పెన సినిమా భారీ విజయం సాధించిన దర్శకుడిగా బుచ్చిబాబు పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అతని దగ్గర పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా మారి తెరకెక్కించిన మొదటి సినిమాని భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరూ బుచ్చిబాబు తర్వాతి సినిమాపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎటువంటి హంగామా లేకుండా మొదటి సినిమాతోనే వంద కోట్లకుపైగా వసూలు చేసిన హీరోగా వైష్ణవ్ తేజ్ రికార్డు సృష్టించగా దాంతో డైరెక్టర్ బుచ్చిబాబు తో కలిసి సినిమాలు చేయాలని నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే బుచ్చిబాబు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయబోతున్నాడని ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో బుచ్చి బాబుతో జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయడానికి ఓకే చెప్పి ఉంటాడని టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. అంతేకాదండోయ్.. జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో కథ కూడా ఓ ప్రేమ కథ అని తెగ వార్తలు రాసేస్తున్నరు. ప్రస్తుతం జూనియర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత.. కొరటాల సినిమా చేసిన తారక్ ఆ తదుపరి బుచ్చిబాబు తో సినిమా చేసే ఛాన్స్ ఉండబోతున్నట్లు టాలీవుడ్ సమాచారం. అయితే ఈ విషయంపై అటు తారక్ కానీ ఇటు బుచ్చిబాబు కానీ ఎవరు స్పందించకపోవడం కొసమెరుపు. చూడాలి మరి ఈ సినిమా పుకార్ల పై క్లారిటీ ఎప్పుడు వస్తుందో.

Share post:

Latest