ఆసుపత్రిలో బాలీవుడ్ నటుడు..కారణం ఏమిటంటే..?

ఈ క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌ట్లేదు. సామాన్యుల ద‌గ్గ‌రి నుంచి ప్ర‌ముఖుల దాకా అందరినీ బ‌లితీసుకుంటోంది. ఇప్ప‌టికే ఎంతోమంది సెల‌బ్రిటీల‌ను, ప్ర‌ముఖుల‌ను మ‌హ‌మ్మారి పొట్ట‌న బెట్టుకుంది. అయితే ఇప్పుడు మ‌రో లెజెండ‌రీ న‌టుడు అనారోగ్య ప‌రిస్థితుల కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరారు. జెండరీ హీరో దిలీప్ కుమార్ (98) శ్వాసకోశ సమస్యలతో ఈ రోజు ఉదయం ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ స‌భ్యులు.

ప్ర‌స్తుతం ఆయ‌న కార్డియాలజిస్ట్ నితిన్ గోఖలె, పల్మనాలజిస్ట్ జలీల్ పర్కార్ పర్యవేక్షణలో నిల‌క‌డ‌గానే ఉన్నాడ‌ని తెలుస్తోంది. దిలీప్ కుమార్ కు వారు దగ్గరుండి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. చికిత్సపై ఎప్ప‌టి క‌ప్పుడు డాక్ట‌ర్లు ప్రకటన చేస్తున్నారు. దిలీప్ కుమార్ గ‌త నెల మేలో కొన్ని అనారోగ్య కార‌ణాల‌తో ఆసుపత్రిలో చేరి, రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయిన విష‌యం తెలిసిందే.ప్ర‌స్తుతం అందరూ కరోనా నిబంధ‌న‌లు పాటిస్తూ క్షేమంగా ఉండాలని దిలీప్ కుమార్ సూచించారు. ఆయ‌న భార్య సైరా భాను కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నారు.

Share post:

Popular