అరుదైన గౌరవం సొంతం చేసుకున్న బిగ్ బాస్ స్టార్..!

బుల్లితెర పై బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రతేకంగా చెప్పవలసిన అవసరం లేదు . మొదలయినప్పటి నుండి మంచి క్రేజ్ పొందిన ఈ షో, ప్రతి సీజన్లో ఆ క్రేజ్ ని రేటింపు చేసుకుంటూ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ వచ్చింది. బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌తో అటు ప్రేక్షకులని ఇంకా సెలబ్రిటీలను కూడా తన స్టైల్ ఇంకా సింప్లిసిటీ తో ఆకట్టుకొని రన్నరప్ గా నిలిచిన అఖిల్ సార్థక్ కు మరో అరుదైన గౌరవం లభించింది. 2020 ఏడాదికి టెలివిజన్ రంగంలో అత్యంత ప్రతిభను చూపిన సెలబ్రిటీలను హైదరాబాద్‌ టైమ్స్ వారు ఎంపిక చెయ్యగా, ఆ జాబితాలో మేల్ కేటగిరీ విభాగంలో అఖిల్ కు నెంబర్ వన్ స్థానం వచ్చింది.

ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్బంగా అఖిల్ మాట్లాడుతూ ఈ అరుదైన గౌరవం నాకి రావడం చాల సంతోషంగా ఉంది అని తెలిపారు . 2020 సంవత్సరానికి గాని టెలివిజన్ రంగం కి సంబంధించి మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా తాను ఎంపిక అయ్యానని అఖిల్ పేర్కొన్నాడు. ఇది కేవలం మీ అందరి ప్రేమ, ఆదరణ వల్లనే సాధ్యమయిందని, అందరికి నా ధన్యవాదాలు, నేను ఇప్పుడు చాలా గర్వంగా అఖిల్ నం .1 అని చెప్పుకోవచ్చు అని అఖిల్ తెలియచేసారు .

Share post:

Popular