జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..!

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ప్రతి నెలా బ్యాంక్ ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మినహాయించి కూడా బ్యాంకులకు మళ్లీ కొన్ని రోజులు సెలవులు ఉండొచ్చు. అందువల్ల బ్యాంక్ ఖాతా కలిగిన వారు బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం మంచిది.
జూన్ 6 – ఆదివారం,
జూన్ 12 – రెండో శనివారం,
జూన్ 13 – ఆదివారం
జూన్ 15 – వైఎంఏ డే/ రాజా సంక్రాంతి (మిజోరం, భువనేశ్వర్‌లో బ్యాంకులు పని చేయవు)
జూన్ 20 – ఆదివారం
జూన్ 25 – గురు హర్‌గోవింద్ జయంతి (జమ్మూ, శ్రీనగర్‌లో బ్యాంకులు క్లోజ్)
జూన్ 26 – నాలుగో శనివారం
జూన్ 27 – ఆదివారం
జూన్ 30 – రేమ్నా ని (ఇజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు)
కాబట్టి 9 రోజులు బ్యాంకులు పనిచేయవు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. జూన్ నెలలో ఒక్క రోజు కూడా బ్యాంకులు సెలవు లేదని చెప్పుకోవచ్చు. ఆదివారం, రెండు నాలుగో శనివారాలు మాత్రం బ్యాంకులు ఎలాగూ పని చేయవు.