ఏపీలో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు…?

దేశంలోని 21 రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేస్తూ… ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ పరీక్షలను రద్దు చేయలేదు. ఇదే విషయంపై సుప్రీం కోర్టులో జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ ఉమేష్ మహేశ్వరి నేతృత్వంలో విచారణ జరిగింది. జూలై చివరిలోపు పరీక్షలు పూర్తవుతాయా? అని సుప్రీం ఏపీ న్యాయవాదిని ప్రశ్నించింది. కాగా.. అంతకంటే ముందే పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తామని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఏపీ సర్కారు చెబుతున్న విధంగా గదికి 15 నుంచి 18 మందితో పరీక్షలు నిర్వహిస్తే.. దాదాపు 34వేల పై చిలుకు గదులు అవసరం పడతాయని… దీనిపై ఏం కసరత్తు చేశారని సుప్రీం ప్రశ్నించింది.

ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేటు వాటిని కూడా వినియోగిస్తామని లాయర్ తెలిపారు. నోటితో చెప్పడం కాదని రాతపూర్వకంగా అఫిడవిట్ సమర్పించాలని సూచించింది. 34 వేల గదుల సంగతి పక్కన పెడితే అంతమంది సిబ్బంది ఎక్కడున్నారని, అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టాలని చూస్తున్నారా.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ.. ప్రభుత్వం చెబుతున్నట్లు పరీక్షలు నిర్వహిస్తే.. ఎవరైనా విద్యార్థులకు ఇబ్బందులు కలిగితే… బాధ్యత తీసుకుంటారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా థర్డ్ వేవ్ ముప్పుపై కూడా చర్చించింది. పరీక్షల కన్నా.. ప్రాణాలు ముఖ్యమని అభిప్రాయపడింది.

ఏపీ న్యాయమూర్తి మాట్లాడుతూ… ఇంటర్నల్ మార్కులపై బోర్డులకు నియంత్రణ ఉండదని తెలిపారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, యూజీసీ నుంచి సూచనలు తీసుకోవాలని సుప్రీం సూచించింది. అంతే కాకుండా నిపుణులతో చర్చించి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ఆదేశించింది. చివరగా మేం సంతృప్తి చెందే వరకు పరీక్షల నిర్వహణకు పర్మషన్ ఇయ్యబోమని తేల్చి చెప్పింది. పూర్తి సమాచారంతో రావాలని ఏపీ లాయర్ నజ్కీని కోరింది.